హోట‌ల్‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌న‌కారులు.. 24 మంది స‌జీవ‌ద‌హ‌నం!

ఢాకా (CLiC2NEWS): బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళ‌నకారులు ఓ హోట‌ల్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో 24 మంది స‌జీవ‌ద‌హ‌న‌మైన‌ట్లు స‌మాచారం. జ‌షోర్ జిల్లాలో అవామీ లీగ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షాహిన్ చ‌క్లాద‌ర్‌కు చెందిన జ‌బీర్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్‌కు నిర‌స‌న‌కారులు నిప్పంటించారు. దీంతో 24 మంది మృతి చెందారు. దేశంలో 20 రోజుల‌కుపైగా కొన‌సాగుతున్న ఆందోళ‌న‌ల కారణంగా వంద‌లాది మంది మృతిచెందారు. దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాజీనామా చేసి , దేశం విడిచి వెళ్లినా.. అక్క‌డ ఘ‌ర్ష‌ణ‌లు ఆగ‌లేదు.

మ‌రోవైపు నిర‌స‌నకారులు ప్ర‌ధాని హాసీనా నివాసంలోకి ప్ర‌వేశించి విలువైన వ‌స్తువులు లూటీ చేశారు. తినుబండారాల‌ను సైతం వ‌ద‌ల‌లేదు. ప్రభుత్వ కార్యాల‌యాల‌పై దాడి చేసి ధ్వంసం చేసిన‌ట్లు స‌మాచారం. హ‌సీనా తండ్రి , బంగ్లాదేశ్ వ్య‌వ‌స్థాప‌కుడు షేక్ ముజిబ‌ర్ రెహ‌మాన్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. అమెరికాలోని న్యూయార్ లో ఉన్న బంగ్లాదేశ్ కాన్సులేట్‌పై కూడా నిర‌స‌న‌కారులు దాడికి దిగిన‌ట్లు స‌మాచారం. లోప‌లి ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.