భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు..
Paris Olympics: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నంబర్‌వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫొగాట్ ఫైనల్‌కు పోరుకు సిద్ధమైంది. బుధవారం రాత్రి ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో ఒలింపిక్ కమిటి ఆమెపై అనర్హత వేటు వేసింది. వినేశ్ 100 గ్రాముల బరువు అదనంగా ఉందంటూ .. 50 కెజిల విభాగం నుండి అనర్హత వేటును ఎరుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఫైనల్‌లో పతకం సాధిస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం అని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.
రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) సిద్దమైంది. మంగళవారం రాత్రి సెమీస్ పోరులో ఫొగాట్ తలపడింది. పోటీకి ముందు బరువుతోపాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, బుధవారం ఉదయానికల్లా బురువు పెరగడంపైన ఐఒఓ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. నంబర్‌వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫొగాట్ ఫైనల్‌కు చేరింది.
హరియాణాకు చెందిన రెజ్లర్ వినేశ్ కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడుసార్లు (2014, 2018, 2022) స్వర్ణం సాధించింది. ఆసియా క్రీడల్లో 2018లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. 2016, 2020 ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో నే నిష్కమించిన ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన ఆమె అత్యధిక సార్లు ఒలింపిక్స్ ఆడిన భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది.