నాబార్డ్‌లో 102 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
NABARD: నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) లో మొత్తం 102 అసిస్టెంట్ పోస్టులు కలవు. దేశవ్యాప్తంగా ఉన్న నాబార్డ్ శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నారు. 30 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒబిసి, ఎస్‌టి,ఎస్‌సి అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి. ఏదైనా డిగ్రీ 60 % మార్కులతో ఊత్తీర్ణులై ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌సి / ఎస్‌టి / పిడబ్ల్యూబిడిలకు 55% ఉంటే సరిపోతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్ , ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక జరుగుతుంది.
మొత్తం 102 పోస్టులలో అన్‌రిజర్వుడ్ పోస్టులు 46, ఒబిసిలకు 26, ఇడబ్లయుఎస్ లకు 9, ఎస్‌సిలకు 11.ఎస్‌టిలకు 10 కేటాయించారు. జనరల్, చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్ప్ , కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, అగ్రికల్చర్, యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్, పుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్, జియో ఇన్ఫర్మేటిక్స్, డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ , ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ సైన్స్, హ్యూమన్ రిసోఎర్స్ మేనేజ్‌మెంట్, రాజ్‌భాష విభాగంలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 15. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://www.nabard.org/ వెబ్‌సైట్ చూడగలరు.