స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాల వారీగా పాల్గొనే మంత్రుల జాబితా

అమరావతి (CLiC2NEWS): స్వాతంత్య్ర దినోత్సవం రోజున విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కంచనున్నారు. కాకినాడలో డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ జాతీయ జండాను ఎగురవేయనున్నారు. ఈ మేరకు స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట్ర , జిల్లా స్థాయిలో పాల్గొనే మంత్రుల జాబితాను ఎపి సాధారణ పరిపాలన శాఖ ప్రోటొకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్ దినేశ్‌కుమార్ జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు.
జిల్లాల వారిగా స్వాతంత్య్ర వేడుకలలో పాల్గొనే మంత్రుల వివరాలు
కర్నూలు – టిజి భరత్
నంద్యాల – బిసి జనార్ధన్ రెడ్డి
అనంతపురం – పయ్యవుల కేశవ్
కడప – ఎన్ ఎండి ఫరూక్
శ్రీ సత్యసాయి – సవిత
అన్నమయ్య – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
చిత్తూరు – సత్యకుమార్
తిరుపతి – ఆనం రామానారాయణ రెడ్డి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు- పి.నారాయణ
ప్రకాశం – డోలా బాలవీరాంజనేయస్వామి
పల్నాడు – గొట్టిపాటి రవికుమార్
గుంటూరు – నారా లోకేశ్
కృష్ణా – కొల్లు రవీంద్ర
ఏలూరు – కొలుసు పార్ధ సారథి
పశ్చిమగోదావరి – నిమ్మాల రామానాయుడు
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ – వాసం శెట్టి సుభాష్
తూర్పుగోదావరి – కందుల దుర్గేష్
అనకాపల్లి – వంగలపూడి అనిత
విశాఖపట్నం – అనగాని సత్యప్రసాద్
పార్వతీపురం మన్యం- గుమ్మిడి సంధ్యారాణి
విజయనగరం – కొండపల్లి శ్రీనివాస్
శ్రీకాకుళం – అచ్చెన్నాయుడు