ఆగస్టు 15 వేడుకలకు పంచాయతీలకు నిధులు పెంపు

అమరావతి (CLiC2NEWS): స్వాతంత్య్ర దినోత్సవపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ వేడుకల నిర్వహణకు పంచాయతీలు నిధులు పెంచినట్లు ఆయన వెల్లడించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుండి రూ 10వేలు , మేజర్ పంచాయతీలకు రూ. 250 నుండి రూ. 25 వేలకు పెంచినట్లు ఆయన తెలిపారు. గణతంత్ర వేడు కలకు ఇదే తరహాలో నిధులు కేటాయిస్తారన్నారు. ఆగస్టు 15న పాఠశాలల్లో విద్యార్థులకు డిబేట్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. వారిని ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేయాలన్నారు.