Medchal: రైలు ఢీకొని ఇద్దరు కుమార్తెలు సహా తండ్రి మృతి

మేడ్చల్ (CLiC2NEWS): మేడ్చల్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో తండ్రి కూతుళ్లు దుర్మరణం చెందారు. మేడ్చల్ రాఘవేంద్రనగర్ కాలనీల ఉంటున్న రైల్వే లైన్‌మెన్ కృష్ణ అతని ఇద్దరు కుమార్తెలు గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందారు. ఆదివారం కృష్ణ డ్యూటికి వెళ్తూ తన ఇద్దరు కుమార్తెలను తనతో తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో రైలు ఢీకొని ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.