నైతిక ఉల్లంఘ‌న ఆరోర‌ణ‌పై థాయ్‌లాండ్ ప్ర‌ధానిపై వేటు..

బ్యాంకాక్ (CLiC2NEWS): నైతిక ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డార‌నే అభియోగాల‌పై థాయ్‌లాండ్ ప్ర‌ధాని స్రెట్టా థావిసిన్ ప‌ద‌వి నుండి తొలగించారు. జైలు శిక్ష అనుభ‌వించిన వ్య‌క్తిని కేబినేట్లో స‌భ్యుడిగా నియామ‌కానికి సంబంధించిన వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన‌మంత్రిపై న్యాయ‌స్థానం వేట వేసింది. రాజ్యంగ న్యాయ‌స్థానం ప‌ద‌వి నుండి తొలిగించిన‌ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని పేర్కొంది. కొత్త ప్ర‌ధాని నియామ‌కానికి పార్ల‌మెంట్ ఆమోదం పొందేవ‌ర‌కు ఆప‌ద్ధ‌ర్మ ప‌ద్ద‌తిలో ప్ర‌స్తుత కేబినేట్ కొన‌సాగుతుంద‌ని తెలిపింది.

ప్ర‌ధాని స్రెట్టా .. కేబినేట్ పున‌ర్‌వ్య‌వ‌స్తీక‌ర‌ణ‌లో భాగంగా పిచిత్ చుయెన్‌బాన్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. 2008లో ఓ కేసుకు సంబంధించి న్యాయ‌మూర్తికి లంచం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించిన కేసులో ఆయ‌న ఆరు నెల‌లు జైలు శిక్ష అనుభ‌వించారు. దీంతో మంత్రిపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న ప‌ద‌వి నుండి వైదొలిగారు. జైలు శిక్ష పూర్తిచేసుకున్నప్ప‌టికీ ఆయ‌న‌ను నిజాయితీ లేని వ్య‌క్తిగా సుప్రీంకోర్టు పేర్కొంటూ తీర్పు ఇచ్చిన విష‌యం ప్ర‌స్తావించింది. ప్ర‌ధాన‌మంత్రి త‌న కేబినేట్ స‌భ్యుల అర్హ‌త‌లు ప‌రిశీలించాల్సిన బాధ్య‌త ఉంద‌ని.. పిచిత్ గురించి తెలిసిన‌ప్ప‌టికీ .. ఆయ‌న‌ను కేబినేట్ లోకి తీసుకోవ‌డం, నైతిక ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌ట‌మేన‌ని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.