భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలి..
ఎర్రకోటపై పంద్రాగాస్టు ప్రసంగంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సుమారు 6 వేల మంది అతిథులు హాజరయ్యారు. అనంతరం ప్రధాన మంత్రి మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం అనాడు దాదాపు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారని తెలిపారు. భారత దేశం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలి. .. 2047 నాటికి వికసిత్ భారత్ మాన లక్ష్యం అని అన్నారు.
అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ప్రధాని తెలిపారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపారు.