70వ‌ జాతీయ చ‌ల‌న‌చిత్ర పుర‌స్కారాలు: జాతీయ ఉత్త‌మ న‌టుడిగా రిష‌బ్ శెట్టి

ఉత్త‌మ న‌టుడి పుర‌స్కారం కాంతార సినిమాకు గాను రిష‌బ్ శెట్టికి ద‌క్కింది. 70వ జాతీయ చ‌ల‌న‌చిత్ర పుర‌స్కారాల‌ను శుక్ర‌వారం కేంద్రం ప్ర‌క‌టించింది. ఉత్త‌మ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ఆట్ట‌మ్ ఎంపికైంది. ఉత్త‌మ నటుడిగా రిష‌బ్ శెట్టి, ఉత్త‌మ న‌టి పుర‌స్కారం నిత్య‌మేన‌న్ (తిరుచిట్రంబ‌ళం), మాన‌సి ప‌రేఖ్ (గుజ‌రాతీ-క‌చ్ ఎక్స్‌ప్రెస్‌)ను జ్యూరి సంయుక్తంగా వ‌రించింది.

ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ‌-2, ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా కేజియ‌ఫ్‌2 (క‌న్న‌డ‌), ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1 (త‌మిళం )ఉత్త‌మ ద‌ర్శ‌కుడుగా సూర‌జ్ బ‌ర్జాత్యా (ఉంచాయి-హింది) ఎంపిక‌య్యారు. 2022 డిసెంబ‌ర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాల‌కుగానూ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.