దేశాన్ని వీడితే డ‌బ్బులిస్తాం..

స్టాక్‌హోమ్‌ (CLiC2NEWS): దేశ జ‌నాభాను త‌గ్గించుకోవ‌డం కోసం దేశాలు వివిధ ప్ర‌య‌త్నాలు చేస్తాయి. దేశ పౌరుల వ‌ల‌స‌లు నియంత్రించాల‌ని స్వీడ‌న్ దేశం కొత్త ప‌థ‌కాన్ని తీసుకొ్చ్చింది. వేరే దేశంలో జ‌న్మించి స్వీడ‌న్‌లో స్థిర‌పడిన వారు .. దేశం వీడితే కొంత సొమ్మును బ‌హుమ‌తిగా ఇవ్వ‌నుంది. అంతేకాకుండా వారి ప్ర‌యాణ ఖ‌ర్చులు కూడా ప్ర‌భుత్వ‌మే భ‌రించ‌నుంది.

స్వీడ‌న్‌లో ఇటువంటి ప‌థ‌కాలు తీసుకురావడానికి కారణం దేశ జ‌న‌భా పెర‌గ‌ట‌మే. దేశంలో 20 ల‌క్ష‌ల‌కు పైగా వ‌ల‌స‌దారులు ఉన్న‌ట్లు స‌మాచారం. జ‌నాభా నియంత్రణ‌కు ఎన్ని ఆంక్ష‌లు పెట్టినా ప్ర‌భావం లేక‌పోవ‌డంతో ఇలా ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతుంది. స్వీడ‌న్‌లో నివసిస్తున్న వ‌ల‌స‌దారులు స్వ‌చ్చందంగా దేశాన్ని వీడితే ప్ర‌యాణ ఖ‌ర్చులు భ‌రిస్తూ.. 10 వేల స్వీడ‌న్ క్రౌన్స్ ఇస్తుంద‌ట‌. అంటే భార‌త్ క‌రెన్సీ ప్ర‌కారం రూ. 80వేలు చెల్లిస్తారు. చిన్నారుల‌కు స‌గం సొమ్మును ఇస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌థ‌కం కేవ‌లం వ‌ల‌స‌దారుల‌కే ఉండేది. ఇప్ప‌టి నుండి వేరే దేశాల్లో పుట్టిన స్వీడ‌న్ పౌరులు (స్వీడ‌న్ పాస్‌పోర్ట్ ఉన్న‌వారు) కు దీన్ని వ‌ర్తింప‌జేయ‌నున్నట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.