పోలీసుల అదుపులో రఘునందన్‌రావు బామ్మర్ది
రూ. కోటి నగదు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ : హవాలా నగదు తరలింపు వ్యవహారంలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, బేగంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాసరావు, అతడి డ్రైవర్ రవికుమార్ ఉన్నట్లు హైదరాబాద్ సిపి అంజనీకుమార్ తెలిపారు. హవాలా నగదు తరలింపు వ్యవారంపై బషీర్‌బాగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి వివరాలు వెల్లడించారు.
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌రావు బామ్మర్ది శ్రీనివాస్‌రావు(47), కారు డ్రైవర్ రవికుమార్(33)ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. విశాఖ ఇండస్ట్రీ బేగంపేట ఆఫీసు నుంచి కోటి రూపాయలు తీసుకుని దుబ్బకలో ఓటర్లకు పంచేందుకు తీసుకువెళ్తున్నట్లు శ్రీనివాసరావు విచారణలో అంగీకరించారిని సిపి తెలిపారు.
నగదుతో పాటు ఇన్నోవా కారు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫోన్‌లో కీలక సమాచారం సేకరించినట్లు చెప్పారు. ఫోన్ కాల్‌లిస్టులో రఘునందన్‌రావుకు నేరుగా శ్రీనివాస్‌రావు ఫోన్ చేసినట్లు ఉందన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నట్లు సీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.