తెలుగువారికి నేష‌న‌ల్ జియోసైన్స్ అవార్డులు..

ఢిల్లీ (CLiC2NEWS): న‌లుగురు తెలుగువారు నేష‌న‌ల్ జియోసైన్స్ -2023 అవార్డులు అందుకున్నారు. రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా మంగ‌ళ‌వారం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో న‌లుగులు అవార్డులు అందుకున్నారు. మిన‌ర‌ల్ బెనిఫిషియేష‌న్‌, స్టెయిన్డ్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలో.. హైదార‌బాద్ ఐఐటి కెమిక‌ల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెస‌ర్ న‌ర‌సింహ రెడ్డి, జియోఫిజిక్స్‌, అప్లైడ్ జియోఫిజిక్స్ విభాగంలో హైద‌రాబాద్ సిఎస్ ఐఆర్ చీఫ్ ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్ బంటు ప్ర‌శాంత కుమార్ పాత్రో, భూకంపాలు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం, వ‌ర‌ద‌లు, సునామీల్లాంటి ప్రకృతి వైప‌రీత్యాల‌పై అధ్య‌యం చేయ‌డంలో ఎపికి చెందిన మ‌ద్రాస్ ఐఐటి ప్రొఫెస‌ర్ శ్రీ‌మ‌త్ తిరుమ‌ల గుదిమెళ్ల ర‌ఘుకాంత్ ల‌కు వ్య‌క్తిక‌గ‌త అవార్డులు ద‌క్కాయి.

అవార్డులు అందుకున్న న‌ర‌సింహ రెడ్డి,       బంటు ప్ర‌శాంత్‌కుమార్ పాత్రో,    శ్రీ‌మ‌త్ తిరుమ‌ల గుదిమెళ్ల ర‌ఘుకాంత్‌,     ఎం.ఎన్‌.ప్ర‌వీణ్‌

 

కేంద్ర బొగ్గుగ‌నుల శాఖ మంత్రి జి. కెష‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఈ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్రమం నిర్వ‌హించారు. ఖ‌నిజాన్వేష‌ణ‌, శిలాజ ఇంధ‌నం క‌నుక్కోవ‌డంలో చూపిన ప్ర‌తిభ‌కు గాను జియాలాజిక‌ల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన న‌లుగురు స‌భ్యుల బృందానికి ప్ర‌క‌టించిన అవార్డును హైద‌రాబాద్‌లో సేవ‌లందిస్తున్న జియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా డైరెక్ట‌ర్ ఎం. ఎన్ ప్ర‌వీణ్ ఈ అవార్డు అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.