ఓట‌రు జాబితా త‌యారీకి షెడ్యూల్‌ విడుద‌ల..

రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన ప్ర‌భుత్వం.. 

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ఓట‌రు జాబితా త‌యారీకి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం బుధ‌వారం షెడ్యూల్‌ విడుద‌ల చేసింది.  తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై స‌ర్కార్ క‌స‌రత్తు ప్రారంభించింది. సెప్టెంబ‌ర్ 6వ తేదీనుండి 21 తేదీ వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేశారు. ఓట‌రు జాబితా త‌యారీపై ఆగ‌స్టు 29న క‌లెక్ట‌ర్ల‌తో ఎస్ ఇసి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఓట‌రు జాబితా త‌యారీకి షెడ్యూల్‌:

సెప్టెంబ‌ర్ 6 న వార్డుల వారీగా ముసాయిదా ఓట‌రు జాబితా ప్ర‌చుర‌ణ‌

సెప్టెంబ‌ర్ 7 నుండి 13 వ‌ర‌కు ఆ జాబితాపై అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌

9,10 తేదీల్లో రాజ‌కీయ పార్టీల నుండా సూచ‌న‌లు స్వీక‌ర‌ణ‌

సెప్టెంబ‌ర్ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్ర‌చుర‌ణ‌

Leave A Reply

Your email address will not be published.