ఉక్రెయిన్‌లో తొలిసారి పర్యటించిన భారత ప్రధాని..

కీవ్ (CLiC2NEWS): భారత ప్రధాని నరేంద్ మోడీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోడీకి దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతం పలికారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు మోడీ నివాళి అర్పించారు.కీవ్ పర్యటనలో ఉన్న మోడీతో జెలెన్‌స్కీ వ్యక్తిగతంగా, బృంద స్థాయిలో భేటీ కానున్నారు. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. కీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోడీ నివాళి అర్పించారు. 1991 లో సోవియట్ నుండి విడిపోయి ఉక్రెయిన్‌గా ఏర్పడిన అనంతరం భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే ప్రథమం. కీవ్‌లోని భారతీయులు మోడీ స్వాగతం పలికారు. వారందరినీ మోడీ ఆప్యాయంగా పలకరించారు.