156 రకాల మందులుపై కేంద్రం నిషేధం

ఢిల్లీ (CLiC2NEWS): 156 రకాల ఔషదాలను కేంద్రం నిషేధించింది. జ్వరం , జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా ఉపయోగించే ఔషధాలలో పలు రకాలు రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో నిషేధించింది. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్ డ్రగ్స్) కాక్‌టెయిల్ డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్ 500 ఎంజి+ పారాసెటమాల్ 125 ఎంజి మాత్రలను, మెఫెనమిక్ యాసిడ్+పారాసెటెమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్‌సిఎల్ + పారాసెటమాల్+ఫినైలెప్రెస్ హెచ్‌సిఎల్, లెవోసెట్రిజెన్+ ఫినైలెప్రైస్ హెచ్‌సిఎల్+ పారాసెటమాల్ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని పేర్కొన్నారు.