కేరళ షిప్‌యార్డ్‌లో ట్రెయినీ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థ-కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఒప్పంద ప్రాతిపదికన రెండు సంవత్సరాల కాలవ్యవధికి 64 ట్రెయినీ పోస్టులు భర్తీ చేయనున్నారు. షిప్ డ్రాప్ట్స్ మ్యాన్ ట్రెయినీ (మెకానికల్) 46, షిప్ డ్రాప్ట్స్ మ్యాన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్) 18 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు డిప్లోమా (మెకానికల్/ ఎలక్ట్రికల్) పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు మించరాదు. మొదటి ఏడాది రూ.14,000.. రెండో ఏడాది రూ.20,000 స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 600 గా నిర్ణయించారు. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరితేదీ ఆగస్టు 31. పూర్తి వవరాలకు https://cochinshipyard వెబ్సైట్ చూడగలరు.