Scholarship: ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారా..

Schholarship: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థుల‌కు కేంద్ర మాన‌వ వ‌న‌రుల విభాగానికి చెందిన స్కూల్ ఎడ్యుకేష‌న్ అండ్ లిట‌ర‌సి విభాగం ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందించ‌నుంది. రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక విద్యార్థ‌లకు ప్ర‌తి నెలా రూ.వెయ్యి చొప్పున తొమ్మిదో త‌ర‌గ‌తి నుడి ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు నాలుగేళ్లు ఉప‌కార‌వేత‌నం అందిస్తారు. అర్హ‌త క‌లిగిన విద్యార్థులు ఎపిలో సెప్టెంబ‌ర్ 6లోపు.. తెలంగాణ‌లో న‌వంబ‌ర్9 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

విద్యార్థులు 7వ త‌ర‌గ‌తిలో 55%తో ఉత్తీర్ణ‌త సాధించాలి. త‌ల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.5 ల‌క్ష‌ల‌కు మించ‌రాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష మంది విద్యార్థుల‌కు ఈ స్కాల‌ర్ షిప్‌లు అందిస్తారు. ఎపిలో 4087, తెలంగాణ‌కు 2921 మందికి కేటాయిస్తారు. ఎపిలో ప‌రీక్ష డిసెంబ‌ర్ 8వ తేదీన‌.. తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 24న నిర్వ‌హిస్తారు.

ప‌రీక్ష ..మొత్తం 180 మార్కుల ప్ర‌శ్నాప‌త్రం ఉంటుంది. పార్ట్ -1 మెంట‌ల్ ఎబిలిటి టెస్ట్‌, పార్ట్ -2 స్కాల‌స్టిక్ అప్టిట్యూడ్ టెస్ట్ ల‌ను ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో నిర్వ‌హిస్తారు.
పూర్తి వివ‌రాల‌కు https://bse.ap.gov.in/NMMS.asps, https://bse.telangana.gov.in/NMMS.aspx వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.