కొత్తూరు మండలంలో అదుపుతప్పిన లారీ.. తల్లీ బిడ్డ మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల చేగూర చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పి పలు వామనాలను ఢీకొట్టింది. లారీ ముందు వెళ్తున్న టెంపో, ఆటో , ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న తల్లీ బిడ్డలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కూతురు, భర్తకు గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వలనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.