తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సిఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని సిఎం ఆరోపించారు. డిసెంబర్ 9 రాష్ట్ర ప్రజలకు పండుగ రోజని.. ఆరోజే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నట్లు సిఎం తెలిపారు.
ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడీని ఏర్పాటు చేసుకొని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టి ప్రజలకు నిషేధం విధించారన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌ను .. ప్రజాభవన్‌గా మార్చి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. సచివాలయం తెలంగాన పరిపాలనకు గుండె అని.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడినుండే విధానపర నిర్ణయాలు తీసుకోవాలి. కానీ గత 10 ఏళ్లు సిఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సచివాలయంలో అందుబాటులో లేరన్నారు.