వైఎస్ఆర్సిపికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా

ఢిల్లీ (CLiC2NEWS): వైఎస్ ఆర్సిపి ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. ఆయన మరో పెంప బీద మస్తాన్ రావుతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ఛైర్మన్ కలిసి రాజీనామా లేకలు సమర్పించినట్లు సమాచారం. ఢిల్లీలో మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో తాను టిడిపిలో చేరబోతున్నట్లు తెలిపారు. అధికారం తనకు కొత్తకాదని, గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశానన్నారు. గత ఏడాదికాలంగా నా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణమాలతో ఇబ్బంది పడ్డానని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా రాజీనామా చేస్తున్నానన్నారు.