గుడ్ల‌వ‌ల్లేరు: ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల క‌ల‌కలం..

గుడ్ల‌వ‌ల్లేరు (CLiC2NEWS): కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు ఇంజినీరింగ్ బాలిక‌ల క‌ళాశాల‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టార‌ని ప‌లువురు విద్యార్థినులు ఆందోళ‌న చేపట్టారు. బాలిక‌ల హాస్ట‌ల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టార‌ని విద్యార్థుల ఆరోపిస్తున్నారు. గురువారం అర్ధ‌రాత్రి దాటాక హాస్ట‌ల్ విద్యార్థినులు ఆందోళ‌న చేప‌ట్టారు. బాలిక‌ల హాస్ట‌ళ్ల‌లో హిడెన్ కెమెరా గుర్తించిన‌ట్లు ఎక్స్ వేదిక‌గా పోస్టులు పెట్టారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగి వారం రోజులైనా యాజ‌మాన్యం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని స‌మాచారం.

పోలీసులు విద్యార్థుల‌ ఆందోళ‌న‌ను అదుపు చేశారు. ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థి విజ‌య్‌ని పోలీసులు హాస్ట‌ల్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరా ఏర్పాటు చేసిన‌ట్లు.. అత‌నికి మ‌రో విద్యార్థిని స‌హ‌క‌రిస్తోందంటూ ప‌లువురు ఆరోపిస్తున్నారు. వీడియోలు విక్ర‌యిస్తున్నాడంటూ విద్యార్థులు దాడికి దిగారు. పోలీసులు అత‌డి సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై సిఎం చంద్ర‌బాబు విచార‌ణ‌కు ఆదేశించారు. హాస్ట‌ల్‌లో ర‌హ‌స్య కెమెరాలు ఉన్నాయ‌నే విద్యార్థినుల ఆందోళ‌న‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆదేశించారు. వెంట‌నే జిల్లా మంత్రి కొల్లు ర‌వీంద్ర‌తో పాటు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎప్‌పిల‌ను ఘ‌ట‌నా స్థలానికి వెళ్లాల‌ని సిఎం ఆదేశించారు. ఈ మేర‌కు టిడిపి అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

ఈ ఘ‌ట‌న‌పై ఎపి కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక ఆడ‌బిడ్డ త‌ల్లిగా ఈ ఘ‌ట‌న న‌న్ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేసిందన్నారు. చ‌దువు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థ‌లు .. పిల్ల‌ల‌కు ఏం నేర్పుతున్నాయోన‌న్న భ‌యం. కాసుల క‌క్కుర్తి త‌ప్ప‌.. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను యాజ‌మాన్యాలు గాలికొదిలేశార‌నే దానికి ఈ ఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ అన్నారు. దీనిపై సాధార‌ణ విచార‌ణ కాదు.. ఫాస్ట్రాక్ విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు. వారంలోపు బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.