తెలుగు రాష్ట్రాలకు వరద సాయం విడుదల: కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో వరద ఉద్ధృతి కారణంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు ఆహారం, నీరు కూడా లేక ఇబ్బందులకు గురైన సంగనతి తెలిసిందే. వరద బాధితులను అదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు సాయం ప్రకటించింది. ఎపి, తెలంగాణకు రూ. 3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనావేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు కేంద్ర బృందం వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు జల దిగ్భంధంలో కాలం గడిపారు. వారికోసం సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి సర్వం కోల్పోయారు. ప్రభుత్వాలు, స్వచ్చంద సేవా సంస్థలు ఆహారం, నీరు పంపిణీ చేస్తున్నాయి. అటు ప్రభుత్వ , ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, సినీ , రాజకీయ ప్రముఖులు సైతం విరాళాలు అందిస్తున్నారు.