విద్యుత్ ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: టిజిఎస్పిడిసిఎల్

హైదరాబాద్ (CLiC2NEWS): విద్యుత్ ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ముషారఫ్ ఫరూఖి తెలిపారు. సంస్థకు చెందిన సిబ్బందిగాని, అధికారులుగాని లంచం అడిగితే వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సిఎండి కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా లంచం అడిగితే.. 040-2345 4884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుల సమస్యలు/ ఫిర్యాదులు నేరుగా తీసుకొని వాటికి పరిష్కరించి అక్రమాలను అడ్డుకునేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.