హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వినేశ్ ఫొగాట్

చండీగఢ్ (CLiC2NEWS): భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శుక్రవారం కాంగ్రెస్ పార్టి లో చేరారు. వినేశ్తోపాటు రెజ్లర్ బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిరువురు పార్టి అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. హరియాణాలోని జులానా అసెంబ్లీ స్థానం నుండి వినేశ్ పోటీకి దింపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో వినేశ్ పేరును ఖరారు చేసింది. మరో రెజ్లర్ పునియా కు ఆల్ ఇండియ కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. వీరు పార్టీలో చేరడానికి ముందు భారత రైల్వేలో ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు.