మహాగణపతికి సిఎం రేవంత్ తొలి పూజలు
ఖైరతాబాద్కు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్ (CLiC2NEWS): వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా గణేశ మండపాలు శోభాయమానంగా ఏర్పాటు చేశారు. ఖైరతా బాద్ లో కొలువుదీరిన సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తు లు భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్ లో గణపతి వేడుకలు ప్రారంభించి 70 సంవత్సరాలు అయి న సందర్భంగా ఈ యేడు 70 అడుగుల ఎత్తయిన వి గ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వహకులు. శని వారం ముఖ్యమంత్రి రేవంత్ వినాయకుడిని దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. సిఎం ఖైరతా బాద్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ ఏర్పాటు చేశారు.