హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపిఎస్‌లు బదలీ అయ్యారు. ఐపిఎస్‌ల బదలీల్లో భాగంగా హైదరాబాద్ కొత్వాల్‌గా సివి ఆనంద్ తిరిగి నియమితులయ్యారు. అలాగే విజిలెన్స్ డిజిగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, ఎసిపి డిజిగా విజయ్ కుమార్‌లను బదలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పొలీస్ పర్సనల్ అదనపు డిజిగా మహేశ్ భగవత్‌కు, పోలీస్ స్పోర్ట్స్ ఐజిగా ఎం. రమేష్ కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.