ట్రెడిషిన‌ల్ నాలెడ్జ్ డిజిట‌ల్ లైబ్ర‌రీ యూనిట్‌లో పోస్టులు

సైన్స్ అండ్ టెక్నాల‌జి మంత్రిత్వ శాఖ‌కు చెందిన
ఢిల్లీలోని సిఎస్ ఐఆర్ – ట్రెడిష‌న‌ల్ నాలెడ్జ్ డిజిట‌ల్ లైబ్ర‌రి యూనిట్ (సిఎస్ ఐఆర్‌-టికెడిఎల్‌యు)లో 21 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుల‌ను సిఎస్ ఐఆర్‌-టికెడిఎల్‌యు, 14, స‌త్సంగ్ విహార్ మార్గ్, కుతుబ్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఏరియా, న్యాఢిల్లీ కి పంపాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఈనెల 18వ తేదీగా నిర్ణ‌యించారు. సెప్టెంబ‌ర్ 20, 23, 25, 24, 30 తేదీలలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

మొత్తం 21 ఖాళీల‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌ఖి 11
ప్రాజెక్ట్ అసోసియేట్‌-ఖిఖి 4,
సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 6 క‌ల‌వు.

అగ్రిక‌ల్చ‌ర్‌, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ, అగ్రిక‌ల్చ‌ర్ , సంస్కృతం, పేటెంట్స్ అగ్రిక‌ల్చ‌ర్, మెట‌ల‌ర్జి, మెటీరియ‌ల్ సైన్స్‌, పేటెంట్స్ – మెట‌ల‌ర్జీ అండ్ మెటీరియ‌ల్ సైన్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జి విభాగాల‌లో ఎంపిక జ‌రుగుతుంది. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో డిగ్రి, బిఇ / బిటెక్‌, పిజితో పాటు ప‌ని అనుభవం, యుజిపి నెట్ స్కోర్ క‌లిగి ఉండాలి.
ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ప్రాజెక్ట్ అసోసియేట్ -ఖి పోస్టుకు నెల‌కు వేత‌నం రూ. 31,000.. ప్రాజెక్ట్ అసోసియేట్ – ఖిఖి పోస్టుకు రూ. 35,000… సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ. 42,000. రాత ప‌రీక్ష‌, షార్ట్ లిస్టింగ్, ఇంట‌ర్వ్యూల ఆధారంగా ఎంపిక జ‌రుతుతుంది.

Leave A Reply

Your email address will not be published.