హైదరాబాద్‌లో ఇకనుండి ప్రతిరోజు శ్రీవారి లడ్డూ విక్రయాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పవిత్రమైన శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం రోజు అందజేయాలని టిటిడి నిర్ణయించింది. నగరంలోని హిమయత్ నగర్ లిబర్టి, జూబ్లిహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రతి శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డు విక్రయాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లడ్డూ ప్రసాదం ఇక నుండి ప్తరి రోజు అందుబాలో ఉండనున్నట్లు టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు టిటిడి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ కుమార్‌లు ప్రకటనలో తెలపారు. శ్రీవారి లడ్డూ జారీలో టిటిడి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చిందని తెలిపారు. రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హిమయత్ నగర్ లిబర్టి, జూబ్లిహిల్స్ ఆలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.