ఒకే కుటుంబంలో ముగ్గురు పాముకాటుతో మృతి

భువనేశ్వర్ (CLiC2NEWS): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిశాలోని బౌధ్ జిల్లాలో చోటుచేసుకుంది. చరియాపలి గ్రామానికి చెందిన శాలేంద్ర మల్లిక్ కుటుంబం ఆదివారం రాత్రి ఇంట్లో నేలపై నిద్రించగా.. తనకు, ముగ్గురు కుమార్తె లకు ఏదో కుట్టినట్లుగా అనిపించింది. దీంతో లేచి చూసేసరికి పక్కన పాము వెళ్తుండటం చూశారు. స్థానికుల సాయంతో వెంటనే నులుగురు ఆస్పత్రికి వెళ్లారు. కానీ.. చికిత్స పొందుతూ ముగ్గురు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. మల్లిక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఒడిశాలో గత ఏడేళ్లలో పాటుకాటుకు గురై 5 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 50వేల మంది పాముకాటుకు బలవుతున్నట్లు సమాచారం.