విదేశాల నుండి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నిర్ధరణ .. క్లేడ్-2 రకంగా గుర్తింపు

ఢిల్లీ (CLiC2NEWS): భారత్‌లో మంకీపాక్స్ కేసు నిర్ధరణ అయినట్లు సమాచారం. విదేశాల నుండి భారత్‌కు వచ్చిన ఓ యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. దీంతో వెంటనే ఐసోలేషన్‌లో లేబొరెటరీకి పంపించారు. అది మంకీపాక్స్ అని నిర్ధరణ అయ్యింది. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 రకంగా తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన ఆత్యయిక స్తితికి కారణమైన క్లేడ్-1 కాదని.. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపింది.
ప్రపంచంలో మంకీపాక్స్ డెన్మార్క్‌లో ముందుగా కోతుల్లో వెలుగుచూసింది. వీటిని పరిశోధన కోసం తెప్పించారు. తర్వాత 1970లో మానవుల్లో వెలుగు చూసింది. 2005లో కాంగోలో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. 2017, 2022 విస్తృతంగా వ్యాప్తి చెందుతూ అనేక దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం 120 దేశాల్లో వెలుగుచూసింది. తాజాగా కాంగోలో ఆందోళనకర స్థాయిలో ప్రాణాంతక వైరస్ వ్యాపిస్తున్నట్లు సమాచారం.