కౌన్ బనేగా కరోడ్‌పతి లో పవన్ పై ప్రశ్న…

ముంబయి (CLiC2NEWS): దేశంలో బుల్లితెరపై సంచలం సృష్టించిన `కౌన్ బనేగా కరోడ్‌పతి` 16వ సీజన్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో అమితాబ్ బచ్చన్ ఓ కంటెస్టెంట్ కు ఎపి డిప్యూటీ సిఎం, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సంబంధించిన ప్రశ్న అడిగారు.
`2024 జూన్‌లో ఎపి లో డిప్యూటీ సిఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు`? అని అడిగారు. కంటెస్టెంట్ ఈ క్వశ్చన్‌కు సమాధానం చెప్పడానికి `ఆడియన్స్ పోల్` ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్ 50 శాతం పైగా పవ్ కల్యాణ్ అని సమాధానం చెప్పారు. దీంతో కంటెస్టెంట్ సూచన మేరకు పవన్ కల్యాణ్ పేరును లాచ్ చేశారు. జవాబు సరైనది కావడంతో కంటెస్టెంట్ రూ. 1.60 లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు.
దేశ రాజకీయాల్లో పవర్ స్టార్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తన పార్టీ జనసేన నుంచి పోటీచేసిన ప్రతి ఒక్కరు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. పోటీ చేసిన రెండీ ఎంపీ, 21 ఎమ్మెల్యే స్థానల్లో జనసేన విజయం కేతనం ఎగురవేసి నూటికి నూరు శాతం స్ట్రైక్ రేటుతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పవన్ కల్యాణ్ పై ప్రశ్న అడగడంతో పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.