గంగమ్మ ఒడికి మహాగణపతి

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లో గణపతి శోభాయాత్ర నేత్రపర్వంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య మహా గణేశుడి నిమజ్జనం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుని హుస్సేన్ సాగర్ జలాల్లో నిమజ్జనం చేశారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర వైభకంగా సాగుతూ మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు.
[…] తప్పక చదవండి: గంగమ్మ ఒడికి మహాగణపతి […]