భార్యాభర్తల మధ్య గొడవ.. భర్తను కత్తెరతో పొడిచిన భార్య

ఉండ్రాజవరం (CLiC2NEWS): చిన్న గోడవ హత్య వరకూ దారితీసింది. భార్యభర్తల మధ్య మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలాగా భర్త హత్యకు దారి తీసింది. ఈ ఘోర ఘటన తూ.గో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. తూ. గో జిల్లా ఉండ్రాజవరం మండలంలోని రెడ్డి చెరువు గ్రామానికి చెందిన చింతలపూడి శ్రీనివాసరావు, రాణి దంపతులు మధ్య కొంత కాలంగా మనస్పర్ధలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ సమయంలో రాణి తన భర్త శ్రీనివాసరావు ఛాతి పై కత్తెరతో పొడిచింది. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును అతని తమ్ముడు తణుకులోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీినివాసరావు మృతి చెందాడు. మృతిడి అన్న గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తామని సిఐ శ్రీనివాసరావు తెలిపారు.