కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 14 రోజులు రిమాండ్

హైదరాబాద్ (CLiC2NEWS): కొరియోగ్రాఫర్ జానీ మాస్టను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆయనకు ఉప్పరపల్లి న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జానీ మాస్టర్‌ను శుక్రవారం గోవా నుండి హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా బాధితురాలు 2019 పరిచయమయింది. 2020లో ముంబయి హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అపుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సిని మా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడు. జానీ మాస్టర్ భార్యకూడా బాధితురాలిని బెదించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.