జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు.. ముగ్గురు జవాన్లు మృతి

శ్రీనగర్ (CLiC2NEWS): బిఎస్ ఎఫ్ బలగాలకు చెందిన ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని బెల్ గ్రామం వద్ద లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడినట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రతా దళం కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలు దేరగా.. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. స్థానికులు, సాయుధ బలగాలు సహాక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.