ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో లా ఆఫీసర్ పోస్టులు

IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) 12 లా ఆఫీసర్ గ్రేడ్-ఎ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీ, ఎల్ ఎల్‌బి లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్‌బి డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థల వయస్సు జూన్ 30, 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఒబిసిలకు మూడేళ్లు, ఎస్‌టి, ఎస్‌సిలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుండి పదిహేనేళ్లు సడలింపు ఉంటుంది. కోర్టులు, ట్రైబ్యునల్‌లలో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు.. ఎక్స్ పీరియన్స్ సర్గిఫికెట్‌లు ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఫీజు లేదు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా తయారుచేసిన షార్ట్‌లిస్టులోని అభ్యర్థులకు .. జిడి, జిటి, పిఐ వివారలను తెలియపరుస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుండి రూ. 1,60,000 జీతం అందుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 8. పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్ చూడగలరు.