జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని, ఎమ్మెల్యేలు సామినేని, కిలారి

మంగళగిరి (CLiC2NEWS): మాజీ మంత్రి బాలినేని, మాజి ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య గురువారం జనసేన పార్టిలో చేరారు. మంగళగిరిలోని పార్టి కార్యాలయంలో పవన్‌కాల్యాణ్ సమక్షంలో వీరు జనసేన పార్టి కండువా కప్పుకున్నారు. వీరు ఇటీవల వైఎస్ ఆర్ పార్టికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఎలాంటి కండిషన్లు లేకుండా జనసేలో చేరానని తెలిపారు. కూటమిలో పనిచేయడం కోసమే వైఎస్ ఆర్ పార్టి నుండి జనసేనలోకి వచ్చినట్లు .. పార్టి బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. వివాదాలకు వెళ్లకుండా కూటమి పార్టిల నేతలతో కలిసి పనిచేస్తానని.. 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నానని.. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అమె అన్నారు.