ఆయుష్మాన్ భార‌త్: 70 ఏళ్ల వ‌య‌స్సుగ‌ల వారంద‌రూ అర్హులే

ఢిల్లీ (CLiC2NEWS): ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య బీమా ప‌థ‌కానికి సంబంధించిన ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పించండంలో భాగంగా అర్హులైన వారి పేర్ల‌ను న‌మోదు ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని రాష్ట్రాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి ఎల్ ఎస్ చాంగ్‌స‌న్ అన్ని రాష్ట్రాల‌కు లేఖ‌రాశారు. ఈ ప‌థ‌కాన్ని 70ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కంలో న‌మోదు కోసం సీనియ‌ర్ సిటిజ‌న్‌లు ఆయుష్మాన్ మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. వీటిలో న‌మోదు చేసుకున్న అర్హులంద‌రికీ ప్ర‌త్యేకంగా ఆయుష్మాన్ కార్డుఉల జారీ చేస్తారు. ఈ రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని, ప‌థ‌కం కూడా త్వ‌ర‌లోనే అమ‌ల్లోకి రానున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.