ఎపిలో 3 నుండి 13 వరకు దసరా సెలవులు
ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో విజయదశమి సెలవులను వెల్లడిస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్ణనలను పరిగణనలోకి తీసుకొన్న సర్కార్ దసరా సెలవును ఒకరోజు ముందుకు మార్చారు. మొదట అక్టోబరు 4వ తేదీనుంచి 13వ తేదీ వరకు సెలవులను ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి పలు అభ్యర్థనలు రాగా.. ఈ సెలవులను అక్టోబరు 3వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు మార్చారు. రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి 14 వ తేదీన తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులను జారీ చేశారు.