నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

ఎడవల్లి (CLiC2NEWS): అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో ఎడవల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అప్పుల బాధతో మనస్తాపానికి గురై ముగ్గురు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. మృతులను సురేశ్, హేమలత, హరీశ్గా గుర్తించారు. మృతదేహాలను బోధన్ ఆసుపత్రికి తరలించారు