భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య రెండో టి20.. భారత్ ఘన విజయం

ఢిల్లీ (CLiC2NEWS): బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. దీంతో మూడు టి20ల సిరీస్ ఓ మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0 తో విజయం కైవసం చేసుకుంది.