దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఇక లేరు

ముంబయి (CLiC2NEWS): దిగ్గజ పారిశ్రామక వేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, పద్మవిభూషన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చకిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.
1937వ సంవత్సరం డిసెంబరు 28వ తేదీన నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. న్యూయార్క్‌లోని కార్నల్ వర్సిటీ నుంచి బి-ఆర్క్ డిగ్రీ పొందారు. 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్స్ నకు చైర్మన్ గా వ్యవహరించారు.
2000 సంవత్సరంలో రతన్ టాటా భారత మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్, 2008 లో దేశ రెండో అత్యున్న పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు.
రతన్ టాటా 1861వ సంవత్సరంలో టాటా గ్రపూలో చేరారు. సంస్థలను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లారు. ఆయన భారత పారిశ్రామిక రంగాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. దాడాపు రూ. 10 వేల కోట్ల టాటా సామ్రాజ్యాన్ని లక్షల కోట్ల రూపాయలకు చేర్చడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. ఆయన సంపాదనలో దాదాపు 65% దాతృత్వానికే వినియోగించిన గొప్ప మనిషి. కరోనా సమయంలో మహమ్మారిపై పోరుకు రూ. 1500 కోట్ల విరాళం అందజేసి ఆయన విశాల హృదయాన్ని చాటుకున్నారు.