రిటైర్‌మెంట్ ప్రకటించిన టెన్నిస్ స్టార్ ఆటగాడు రఫెల్ నాదల్

Rafael Nadal: 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన టెన్నిస్ స్టార్ ఆటగాడు రఫెల్ నాదల్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైరవుతున్నానని .. నవంబర్లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. 38 ఏళ్ల స్పెయిన్ బుల్ నాదల్.. ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచాడు. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు.