ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. మహిషాసురమర్దనిగా అమ్మవారు

విజయవాడ (CLiC2NEWS): శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా కనకదుర్గ అమ్మవారు శుక్రవారం మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై తొమ్మిదో రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సకలదేవతల శక్తులన్నీ మహిషాసురమర్దని దేవిలో మూర్తీభవించి ఉంటాయి. మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం .. అనేక ఆయుధాలతో సింహవాహినియై భక్తలకు దర్శనమిస్తారు.