ర‌త‌న్‌టాటా వారుసుడిగా నోయ‌ల్ టాటా..

టాటా ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా నోయ‌ల్ టాటా

Tata Trust Chairmen: టాటా ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా నోయ‌ల్ టాటా నియ‌మితుల‌య్యారు. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ర‌తన్ టాటా తుడిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వార‌సుడిగా, ఆయ‌న‌కు వ‌ర‌స‌కు సోద‌రుడైన నోయ‌ల్ టాటాను బోర్డు ఎంపిక చేసింది. నోయ‌ల్ టాటా.. టాటా గ్రూపులోని ప‌లు కంపెనీల్లో వివిధ కీల‌క హోదాల్లో బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ర‌త‌న్ టాటా ట్ర‌స్ట్ బోర్డులోను నోయ‌ల్ స‌భ్యుడిగా ఉన్నారు.

దిగ్గ‌జ వ్యాపార‌వేత్త ర‌త‌న్‌టాటా మ‌ర‌ణంతో టాటా ట్ర‌స్ట్స్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఖాళీ అయ్యింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా స‌న్స్‌లో టాటా ట్ర‌స్ట్స్‌కే అత్య‌ధికంగా 66% వాటా ఉంది. దానివ‌ల్ల టాటా ట్ర‌స్ట్స్‌కు ఛైర్మ‌న్ హోదాలో ఉన్న వ్యక్తి.. గ్రూపు కంపెనీల కార్య‌క‌ల‌పాలు, వృద్ధి నిర్ణ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాలి. ఈ ఛైర్మ‌న్ ప‌దవిని ఇప్ప‌టి వ‌ర‌కు ర‌త‌న్ టాటా ఉన్నారు. తాజాగా నోయ‌ల్ టాటాకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.