ఏపి సిఎం చంద్రబాబుతో చిరంటీవి భేటీ.. రూ. కోటి విరాళం అందజేత

హైదరాబాద్ (CLiC2NEWS): వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఎపి, తెలంగాణకు టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం సిఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మెగాస్టార్ కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తరఫున రూ. 50 లక్షలు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తరఫున మరో రూ. 50 లక్షల చెక్కులను సిఎం చంద్రబాబుకు అందజేశారు. విపత్కర పరిస్తితిలో అందగా నిలిచిన చిరంజీవి సిఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.