ఏపీలో పలుచోట్ల భారీ వర్ష సూచన..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని,.. దాని ప్రభావంతో అక్టోబరు 14, 15, 16వ తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూమ్‌లోని టోల్ ఫ్రీ నంబర్లు 1070,112, 1800.425-0101ను సంప్రదించాలని అధికారులు సూచించారు.