డిఒపిటి ఉత్త‌ర్వులు ర‌ద్దు చేయాల‌ని క్యాట్‌లో ఐఎఎస్‌ల పిటిష‌న్లు

ఢిల్లీ (CLiC2NEWS): తాము తెలంగాణ‌లోనే కొన‌సాగుతామని.. డిఒపిటి ఉత్త‌ర్వులు ర‌ద్దు చేయాల‌ని ఐఎఎస్‌లు కా్య‌టా్‌ను ఆశ్ర‌యించారు. తెలంగాణ‌, ఎపిలో కొన‌సాగుతున్న ఐఎఎస్‌, ఐపిఎస్ అధికార‌లు పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం కింద కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాల‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డిఒపిటి) ఆదేశించింది. దీనిని స‌వాల్ చేస్తూ ప‌లువురు ఐఎఎస్ అధికారులు కేంద్ర ప‌రిపాల‌నా ట్రైబ్యున‌ల్ (క్యాట్‌)ను ఆశ్ర‌యించారు.

డిఒపిటి ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ వాకాటి క‌రుణ‌, వాణి ప్ర‌సాద్‌, ఆమ్ర‌పాలి, సృజ‌న .. వేర్వేరుగా పిటిష‌న్‌లు దాఖ‌లు చేశారు. తెలంగాణ‌లోనే కొనసాగేలా మ‌ధ్యంత‌ర‌ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని వాకాటి క‌రుణ‌, వాణి ప్ర‌సాద్‌, ఆమ్ర‌పాలి కోరారు. అదేవిధంగా ఎపిలోనే కొనాసాగే ఉత్త‌ర్వ‌లు ఇ్వాల‌ని ఐఎఎస్ అధికారిణి సృజ‌న కోరారు. వారి పిటిష‌న్ల‌పై క్యాట్ మంగ‌ళ‌వారం విచార‌ణ చేపట్టనుంది.

తెలంగాణ‌, ఎపి కేడ‌ర్ విభ‌జ‌న‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

Leave A Reply

Your email address will not be published.