నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో 336 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు

NFL: దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్) యూనిట్లు కార్యాలయాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికోసం నొయిడాలోని ఎన్ఎఫ్ఎల్ మొత్తం 336 పోస్టల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
1.జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ప్రొడక్షన్)…108 పోస్టులు ఉన్నాయి. వీటికోసం బిఎస్‌సి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా కెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ ఇంజినీరింగ్ (పెట్రో కెమికల్/ కెమికల్ టెక్నాలజిలో మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమా ఉండాలి.
2. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ -2 (ఇన్‌స్ట్రమెంటేషన్)-33… ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ / ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
3. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్)-14… ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
4. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 కెమికల్ ల్యాబ్ 10 కెమిస్ట్రి ఒక సబ్జెక్టుగా బిఎస్ సి ఉత్తీర్ణులైఉండాలి.
5. స్టోర్ అసిస్టెంట్ -19 ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులు అర్హులు.
6. నర్స్ – 10 … 10+2 (సైన్స్) , జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరి డిప్లొమా లేదా బిఎస్ సి నర్సింగ్ (ఆనర్స్) / బిఎస్‌సి 7. నర్సింగ్ (పోస్ట్ బేసిక్) పూర్తిచేసి ఉండాలి. రాష్ట్ర/ కేంద్ర ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు కావాలి.
7. అకౌంట్స్ అసిస్టెంట్ -10 …. బికామ్ ఉత్తీర్ణత
8. అటెండెంట్ గ్రేడ్ 1 (మెకానికల్ )-ఫిట్టర్ – 40 మెట్రిక్+ ఐటిఐ ఫిట్టర్ పాసవ్వాలి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 30.09.2024 నాటికి 18 నుండి 30 ఏళ్ల వయస్సు ఉండాలి. దరఖాస్తు రుసుం రూ. 200గా నిర్ణయించారు. దరఖాస్తుకు చివరితేదీ నవంబర్ 8. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు హైదరాబాద్, విజయవాడలో నిర్వహిస్తారు.
ఎంపిక , పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలకు అభ్యర్థులు www.nationalfertilizers.com వెబ్‌సైట్ చూడగలరు.