హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 44 పోస్టుల భర్తీ

HAL: బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్)లో ఒప్పంద ప్రాతిపదికన 44 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫైనాన్స్, ఫైర్, ప్లైట్ ఆపరేఫన్ అండ్ సేప్టీ , హెచ్ ఆర్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా కమ్యూనికేషన్ , కంపెనీ సెక్రటరీ , ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్ మెంట్ విభాగాల్లో పోస్టులు కలవు. ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1. డిప్యూటి జనరల్ మేనేజర్ (గ్రేడ్-7) .. డిగ్రీ , ప్లయిట్ సేప్టీ కోర్సు పూర్తిచేయాలి. ఆరేళ్ల ఉద్యోగానుభవం అవసరం. అభ్యర్థుల వయస్సు 47 ఏళ్లకు మించరాదు. ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ. 90వేల నుండి 2,40,000 వరకు అందుతుంది.
2. మేనేజర్ (గ్రేడ్-4) .. ఇంజినీరింగ్ డిగ్రీ / టెక్నాలజి పాసవ్వాలి. ఆరేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించరాదు. నెలకు వేతనం రూ. 60వేల నుండి 1,80,000 వరకు ఉంటుంది.
3. డిప్యూటి మేనేజర్ (గ్రేడ్-3)25.. ఇంజినీరింగ్ డిగ్రీ / టెక్నాలజి చదవాలి. అభ్యర్థుల వయస్సు 38 ఏళ్లకు మించరాదు. గ్రేడ్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ. 50వేల నుండి 1,60,000 వరకు అందుతుంది.
— ఫైనాన్స్ విభాగంలో ఈ పోస్టుకు సిఎ/ ఐసిడబ్ల్యూఎ డిగ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా / ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి పూర్తి చేయాలి.
— హెచ్ ఆర్ విభాగంలో హ్యూమన్ రిసోర్సెస్ / పర్సనల్ మేనేజ్ మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / లేబర్ మేనేజ్ మెంట్ / ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్ తో పాటు పిజి డిగ్రీ లేదా పిజి డిప్లొమా పూర్తి చేయాలి.
— పిఆర్/ మీడియా కమ్యూనికేషన్ విభాగంలో డిగ్రీతోపాటు జర్నలిజం కమ్యూనికేషన్ / జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ / కమ్యూనికేషన్/ జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్ / బ్రాడ్ కాస్ట్ జర్నలిజం / మీడియా కమ్యూనికేషన్ / పబ్లిక్ రిలేషన్స్‌లో పిజి డిగ్రీ లేదా పిజి డిప్లొమా చేయాలి. నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.
4. ఆఫీసర్ (గ్రేడ్-2) 14.. పిఆర్ / మీడియా కమ్యూనికేషన్ విభాగంలో ఆఫీసర్ పోస్టులకు డిప్యూటి మేనేజర్ పిఆర్ / మీడియా కమ్యూనికేషన్ కు పేర్కొన్న విద్యార్హతలే వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థలకు నెలకు రూ. 40వేల నుండి 1,40,000 ఉంటుంది.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి పూర్తి వివరాలకు http://www.hal-india.co.in/ వెబ్‌సైట్ చూడగలరు.